Sat Nov 23 2024 22:07:05 GMT+0000 (Coordinated Universal Time)
ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేం.. కానీ : మంత్రి వేముల
ఈ నేపథ్యంలో రాష్ట్రమంత్రులు ప్రజల్లో ధైర్యం నింపేందుకు జోరువానలో నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. క్షేత్రస్థాయిలో..
జోరు వానలో.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించిన మంత్రి వేముల
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 60 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదుకావడంతో.. ఎక్కడికక్కడే గ్రామాలు, పట్టణాలు, కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రమంత్రులు ప్రజల్లో ధైర్యం నింపేందుకు జోరువానలో నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి.. స్థానికులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. నదులకు వరదప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో.. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ నుండి జగిత్యాల్ కు వెళ్లే జాతీయ రహదారి వద్ద, పడగల్ గ్రామానికి వెళ్లే దారిలో చెరువులు తెగి వరదలు రోడ్ల పై నుండి పారుతుండటంతో ప్రభావిత ప్రాంతాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులంతా ఫీల్డ్ లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story