Sun Dec 22 2024 15:58:03 GMT+0000 (Coordinated Universal Time)
నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డివే.. జగ్గారెడ్డి ఫైర్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. నిర్ణయాలన్నీ రేవంత్ మాత్రమే తీసుకుంటున్నారన్నారు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి విమర్శలు చేశారు. నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డి మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు. సమిష్టి నిర్ణయాలు ఏవీ జరగడం లేదన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు రేవంత్ ను దించి పదవి పొందాలని ఎవరికీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ సక్సెస్ అయ్యారో? ఫెయిలయ్యారో? ప్రజలే చెప్పాలని జగ్గారెడ్డి అన్నారు.
ఎవరి జాగీరు కాదు..
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి జాగీరు కాదని ఆయన అన్నారు. ఎవరితో చర్చించకుండానే రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పొరపాటు ఏదీ లేదని, అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ గానే ఉంటారని తాను అనుకుంటున్నానని అన్నారు.
Next Story