Sun Dec 22 2024 16:30:08 GMT+0000 (Coordinated Universal Time)
జగ్గారెడ్డి అలా ఎందుకు చేశారు?
సంగారెడ్డిలో ముస్లింలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు దీనికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆహ్వానం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కలవరు. అది అంతే. సమిష్టిగా పోరాడి విజయం సాధించాలన్న ధ్యాస నాయకులకే లేదు. ఇక క్యాడర్కు ఎందుకుంటుంది? తెలంగాణ రాష్ట్రం ఇచ్చి రెండు సార్లు ఓటమిపాలయినా ఇంకా నేతలు మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యనేతలను ఆహ్వానించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.
రేవంత్కు అందని ఆహ్వానం...
ఈరోజు సాయంత్రం సంగారెడ్డిలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆహ్వానం లేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా దూరం పెట్టారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉండటంతో ఆయనకు ఆహ్వానం లేదని అనుకున్నా, రేవంత్ ను పిలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రే, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను మాత్రం జగ్గారెడ్డి పిలిచారు.
Next Story