Sun Dec 22 2024 08:13:11 GMT+0000 (Coordinated Universal Time)
Lasya Nanditha:ఎమ్మెల్యే లాస్య మృతి కేసులో.. ఊహించని ట్విస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదం తెలంగాణలో సంచలనం
Lasya Nanditha:బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదం తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్ను పటాన్చెరు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా టిప్పర్ను గుర్తించిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
లాస్య నందిత కారు ఓఆర్ఆర్పైకి ఎంట్రీ అయిన సమయంలో ముందు వెళ్తున్న లారీని సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను పటాన్చెరు పోలీసులు కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. టిప్పర్ను ఢీకొట్టడొంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు.లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ను డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడని తెలుస్తోంది. టిప్పర్ను ఢీ కొట్టిన తర్వాత అదుపుతప్పిన కారు 100 మీటర్ల దూరం వెళ్లి రెయిలింగ్ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న లాస్య నందిత పీఏ ఆకాష్ నిద్ర మత్తులోకి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు తొలుత టిప్పర్ను ఢీకొట్టిందా.. లేదంటే టిప్పరే కారును ఢీకొట్టిందా.. అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story