Mon Dec 23 2024 03:56:35 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట విషాదం
మూడురోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష్ణువర్థన్.. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు..
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడైన విష్ణువర్థన్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. మూడురోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష్ణువర్థన్.. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విష్ణువర్థన్ రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఎమ్మెల్యే కుమారుడి మృతితో నియోజకవర్గం వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విష్ణువర్థన్ కు భార్య కిరణ్మయి తో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
Next Story