Mon Dec 23 2024 11:07:06 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ నన్ను వదులుకోక పోవచ్చు
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
భారతీయ జనతా పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వీలయినంత త్వరలో తాను పార్టీ అధినాయకత్వానికి వివరణ ఇస్తానని తెలిపారు. తన వివరణతో పార్టీ హైకమాండ్ సంతృప్తి చెందుతుందని భావిస్తున్నానని రాజాసింగ్ తెలిపారు. పార్టీ తనను వదులుకోదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
న్యాయపరంగానే ఎదుర్కొంటా...
ఇక తనపై పన్నెండు కేసులు నమోదయ్యాయని, వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటానని రాజాసింగ్ తెలిపారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. తాను వీడియోలో ఎక్కడా ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యానించలేదని కూడా రాజాసింగ్ తెలిపారు. కోర్టు పరిమితుల దృష్ట్యా తాను ఎక్కువగా మాట్లాడలేనని, ఈ వివాదానికి త్వరలోనే ముగింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story