Mon Dec 23 2024 01:11:08 GMT+0000 (Coordinated Universal Time)
కుటుంబం ఆత్మహత్య కేసు : వనమా రాఘవ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి.. తనభార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి.. తనభార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు.. వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో వనమా రాఘవే తమ ఆత్మహత్యకు కారణమని పేర్కొనడంతో.. అతడిని కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
Also Read : ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై అత్యాచారం, హత్య !
ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పాల్వంచ ఆత్మహత్య ఘటన తనను తీవ్ర క్షోభకు గురిచేసిందన్నారు. తన కుమారుడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే ఇలా లేఖ రాసిన గంటల వ్యవధిలోనే హైదరాబాద్ లో రాఘవను అరెస్ట్ చేశారు పోలీసులు.
News Summary - MLA Vanama Venkateswara Rao son Vanama Raghavendra Arrested by Kothagudem Police at Hyderabad
Next Story