Thu Dec 26 2024 13:26:43 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్.. ఇంకా ఎంతమంది ఉన్నారో?
బీఆర్ఎస్ నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేలు వరసగా పార్టీని వీడుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేలు వరసగా పార్టీని వీడుతున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించినప్పటికీ నేతలు పార్టీని వీడటం మాత్రం ఆగడం లేదు. తాజాగా మరొక బీఆర్ఎస్ ఎమెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వరస బెట్టి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ ను వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల బాన్సువాడ, జగత్యాల ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజీవ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా తాజా కాలె యాదయ్య చేరికతో పది రోజుల్లోనూ ముగ్గురికి సంఖ్య చేరింది. భవిష్యత్ లో మరి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరతారో అన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతుంది.
Next Story