Mon Dec 23 2024 10:01:46 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల భేటీ
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో ఈ భేటీ కొనసాగుతుంది. కూకట్ పల్లి కుత్బుల్లాపూర్, ఉప్పల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
హైకమాండ్ దృష్టికి...
తమను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలను మల్లారెడ్డి తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలన్న యోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసింది. అయితే ఈ విషయంలో తనకేమీ తెలియదని, ఎందుకు సమావేశమయ్యారో మీరే కనుక్కోవాలంటూ మల్లారెడ్డి విలేకర్లకు సూచించారు.
Next Story