Mon Nov 18 2024 20:34:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల ఎర కేసు : విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచారణ వాయిదా పడింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచారణ వాయిదా పడింది. వచ్చే శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉండటంతో ఎప్పుడు తిరిగి విచారణ జరుగుతుందన్నది వెల్లడి కాలేదు. శుక్రవారం ఈ కేసు విచారణను చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ముగియడంతో కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.
ముఖ్యమంత్రి సీడీలు పంపడంపై...
అంతకు ముందు జరిగిన వాదనలు జోరుగా సాగాయి. ముఖ్యమంత్రి అనుసరించిన పద్ధతి సరికాదంటూ ఈ సందర్భంగా జస్టిస్ గబాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను ముఖ్యమంత్రి న్యాయమూర్తులకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున దుష్యంత్ దవే ఇందుకు క్షమాపణలు కూడా చెప్పారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందికదా? మరి సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందనడం ఎంతవరకూ సబబని ధర్మాసనం ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసులో వాదించేందుకు తగిన సమయం కావాలంటూ దష్యంత్ దవే కోరారు. అందుకు తగిన సమయం న్యాయస్థానం ఇచ్చింది.
Next Story