Sun Dec 22 2024 23:38:42 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక.. ఏదైతే ఉందో నాకు తెలియకుండా?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తనకు సమాచారం లేకుండా తన ఇలాకాలో ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఆయన ఒకింత ఇబ్బందికి గురవుతున్నారు. దీంతో తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నానని జీవన్ రెడ్డి సంకేతాలు పంపారు.
ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై...
బీఆర్ఎస్ పార్టీ నుంచి తన జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పటికీ తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం చెందుతున్నారని సమాచారం. సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ.. జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కో అర్డీనేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆయనతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటా రంటున్నారు.
Next Story