Mon Dec 23 2024 07:13:41 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : రైతు బంధు ఆపేయించింది కాంగ్రెస్సే
రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో నిలిపివేయించింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో నిలిపివేయించింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధులను నిలిపేసిందని పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ రైతు బంధును నిలిపేసిన కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
అధికారంలోకి రాగానే....
రైతుల నోటి కాడ ముద్దను లాగేసింది కాంగ్రెస్ మాత్రమేనని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా కవిత విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్ద వ్యాపారులకే రుణాలను మాఫీ చేసిందని, రైతులను మాత్రం పట్టించుకోలేదని ఆమె అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేస్తామని చెప్పిన కవిత గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ఉద్యోగాలను తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. మతం, కులం పేరుతో ప్రజలను విడదీసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
Next Story