Sun Dec 29 2024 13:44:01 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ ట్వీట్ కు కవిత కౌంటర్
వరి ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు
వరి ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధదించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒకనీతి, ఇతర రాష్ట్రాలకు మరొక నీతి ఉండకూడదని కవిత అభిప్రాయపడ్డారు.
టీఆర్ఎస్ కు సంఘీభావం....
మీరు ఎంపీగా ఉన్నారని, ధాన్యం కొనుగోళ్లపై ప్రతిరోజు పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారన్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా కాంగ్రెస్ కూడా పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని కవిత రాహుల్ గాంధీని కోరారు.
Next Story