Tue Jan 07 2025 21:38:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరిన కవిత కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. గత 16వ తేదీన విచారణకు గైర్హాజరైన కవిత ఈరోజు మాత్రం విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు విచారిస్తున్నారు. కవిత వెంట కొందరు న్యాయవాదులు కూడా బయలుదేరి వెళ్లారు.
అన్ని రిమాండ్ రిపోర్టులలో...
ఈరోజు అరుణ్ రామచంద్రపిళ్లై, మనీష్ సిసోడియాలను కవితను కలిపి విచారించే అవకాశముందని తెలిసింది. కవితను ఈరోజు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ప్రతి సారీ జరుగుతూనే ఉంది. అన్ని రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండటంతో ఆమెను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కవిత వెంట మంత్రి శ్రీనివాసగౌడ్ కూడా ఉన్నారు. గత విచారణలో దాదాపు 9 గంటల పాటు కవితను విచారించారు. ఈసారి ఎంతసేపు విచారిస్తారన్నది తెలియాల్సి ఉంది.
Next Story