Sun Dec 14 2025 18:09:29 GMT+0000 (Coordinated Universal Time)
తప్పుడు ఆరోపణలు.. దర్యాప్తునకు సహకరిస్తా
ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఏదో కేసీఆర్ కూతురును బద్నాం చేస్తే ఆయనకు ఇబ్బంది అవుతుందని భావించి వ్యర్థ ప్రయత్నాలు కొందరు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను మానసికంగా కుంగదీయాలని చేస్తున్న ప్రయత్నం తప్ప మరేమీ లేదని కవి తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు.
ఎవరికి భయపడబోం...
ఎవరికీ తాము భయపడేది లేదని కవిత తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన పరిణామం కాదన్నారు. తెలంగాణ ప్రజలు అందరూ గమనించాలని కవిత కోరారు. విపక్షాలపై బట్ట కాల్చి మీద వేయడం బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. కక్ష పూరితంగానే తనపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని ఆమె అన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానని కవిత తెలిపారు.
Next Story

