Fri Jan 10 2025 03:51:27 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం వైఖరిపై కవిత ఫైర్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితాలను రద్దు చేయాలన్న వైఖరిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. అన్ని రాష్ట్రాలూ వ్యతిరేకిస్తేనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందన్నారు. పేదలకు అందే సంక్షేమ పథకాలను రద్దు చేయడం ఏంటని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నలభై లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు అలాంటి కార్యక్రమాలను ఆపాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
ఉచితాలు ఆపితే...
కోర్టుల సహకారంతో ఉచిత పథకాలను ఆపాలన్న కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. సంక్షేమం వేరు, ఉచితం వేరు అని ఎమ్మెల్సీ కవిత అనన్ారు. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారిని మాత్రం కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తుందన్నారు. బ్యాంకులను మోసం చేసి వేల ఎగ్గొట్టినా, వారికి రుణాలను మాఫీ చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి చేతులు వస్తాయని, పేదల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను మాత్రం రద్దు చేయాలని కోరడం ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతుందని కవిత అన్నారు.
Next Story