Mon Dec 23 2024 18:22:06 GMT+0000 (Coordinated Universal Time)
అరవింద్.. జాగ్రత్త.. కవిత వార్నింగ్
తనపైన, కేసీఆర్ పైన లేని ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
తనపైన, కేసీఆర్ పైన లేని ఆరోపణలు చేస్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. తన గురించి అడ్డగోలుగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు. భాషలేదు, మంచి లేదు. పద్ధతి లేదు. ఎవరిమీద పడితే ఎంత మాట మాట్లాడితే ఊరుకుంటామని అనుకున్నావా? అని కన్నెర్ర చేశారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడనంటూ తప్పుడు మాటలను అరవింద్ మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాలు చెయ్... కానీ పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని కవిత హెచ్చరించారు. పార్లమెంటులో అరవింద్ పెరఫార్మెన్స్ సున్నా అని అన్నారు. నాలుగేళ్లలో కేవలం ఐదు సార్లు మాత్రమే ఆయన మాట్లాడారన్నారు.
బాధతో మాట్లాడుతున్నా....
128 మంది అభ్యర్థులను నిలబెట్టి, కాంగ్రెస్ తో మిలాఖత్ అయి గెలిచింది నువ్వు అని ఆమె అన్నారు. తర్వాత వారందరినీ బీజేపీలో చేర్చుకున్నారని తెలిపారు. ఇవాళ బాధతో మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. ఇంతవరకూ తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, ఇప్పడు అరవింద్ మాటలకు బాధపడి మాట్లాడాల్సి వస్తుందని, తెలంగాణ సమాజానికి ఇందుకు క్షమాపణ చెబుతున్నానని ఆమె అన్నారు. ఇన్నాళ్లూ బురద మీద రాయి వేయి కూడదనే అరవింద్ ను పట్టించుకోవడం లేదని, కాని మితి మీరి మాట్లాడుతుంటే సహించలేకపోయానని కవిత అన్నారు.
అరవింద్ ఇంటిపై దాడి...
మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంటిలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులను తోసుకుని అరవింద్ ఇంటిలోపలికి వెళ్లి ఆయన కారుతో పాటు అద్దాలను, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవిత, కేసీఆర్ పై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ కార్యకర్తలు హెచ్చరించారు.
Next Story