Mon Dec 23 2024 18:04:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కు తప్పిన పెను ప్రమాదం
శంకరపట్న మండలం తాడికల్ వద్ద కౌశిక్ రెడ్డి కాన్వాయ్ కి ఓ బైకు అడ్డు
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. హుజూరబాద్లో 2కే రన్ కోసం హాజరైందుకు కరీంనగర్ నుండి వెళ్తుండగా మార్గ మధ్యలో గల మానకొండుర్ మండలం తాడికల్ సమీపంలో బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొని పొలాల్లోకి కౌశిక్ రెడ్డి కారు దూసుకెళ్లింది. ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. బైక్పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా ఆ వ్యక్తిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వేరే వాహనంలో హుజూరాబాద్ 2k రన్ కార్యక్రమానికి వెళ్ళిపోయారు.
శంకరపట్న మండలం తాడికల్ వద్ద కౌశిక్ రెడ్డి కాన్వాయ్ కి ఓ బైకు అడ్డుగా వచ్చింది. దీంతో దానిని తప్పించే క్రమంలో రోడ్డు ప్రక్కనున్న చెట్టును కారు ఢీ కొంది. కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి హుజురాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హుజురాబాద్ ఆసుపత్రి కి తరలించారు. కౌశిక్ రెడ్డికి ప్రాణాపాయం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు.
Next Story