Sun Dec 22 2024 22:27:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే!!
భారతప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు నేడు వస్తున్నారు. భారతీయ
భారతప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు నేడు వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత ఆయన తెలంగాణకు వస్తూ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో సంగారెడ్డి, ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. సుమారు 7వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మొదలుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
15,718 కోట్లతో అభివృద్ధి పనులు:
ఈ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 6,697 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ లో, 9,021 కోట్ల రూపాయలతో సంగారెడ్డిలో ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు ఉన్నాయి. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను ప్రధాని ప్రారంభిస్తారు.
4వ తేదీ ప్రధాని మోదీ షెడ్యూల్:
* ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన
* 11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.
* మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
* సోమవారం రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్నారు.
5వ తేదీ షెడ్యూల్:
సంగారెడ్డిలో పర్యటన
* ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి ప్రధాని మోదీ బయలుదేరుతారు.
* 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
* 11.30 నుండి 12.15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రసంగం.
* తెలంగాణ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఒడీశాకు ప్రయాణం.
Next Story