Mon Dec 23 2024 05:21:04 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో మంకీపాక్స్ కేసు.. నేడు రిపోర్ట్
తెలంగాణలో మంకీపాక్స్ కలవరం రేపుతుంది. కామారెడ్డి జిల్లాలో కువైట్ నుంచి వచ్చిన యువకుడికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయి.
తెలంగాణలో మంకీపాక్స్ కేసు కలవరం రేపుతుంది. కామారెడ్డి జిల్లాలో కువైట్ నుంచి వచ్చిన యువకుడికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయి. వెంటనే ఆ యువకుడిని నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచారు. ఫీవర్ ఆసుపత్రిలో మంకీపాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసీయూను ఉంచారు. కువైట్ నుంచి వచ్చిన యువకుడికి జ్వరంతో పాటు శరీరం పై దుద్దుర్లు రావడంతో మంకీపాక్స్ గా అనుమానించారు.
ఫలితం కోసం...
ఆ యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి రక్తనమూనాలను సేకరించి పూనే వైరాలజీ ల్యాబ్ కు పంపారు. దాని ఫలితాలు నేడు రావాల్సి ఉంది. ఫలితాలు నేడు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాని అది మంకీపాక్స్ కేసా? కాదా? అన్నది తెలియదు. ఫలితాల కోసం వైద్య శాఖ అధికారులు వేచి చూస్తున్నారు. ఫలితం వచ్చిన తర్వాత చర్యలు చేపట్టాలని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు.
Next Story