Wed Mar 26 2025 19:39:17 GMT+0000 (Coordinated Universal Time)
మిడ్ మానేరులో.. ముగ్గురు పిల్లలతో సహా దూకిన తల్లి
బోయిన్ పల్లి మండలం కొదురుపాక నాలుగు వరుసల వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి గ్రామం.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి మిడ్ మానేరు జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నలుగురూ మృతి చెందారు. మృతులను పోలీసులు.. గజఈతగాళ్ల సాయంతో వెలికి తీశారు. మృతుల్లో 14 నెలల పసికందు కూడా ఉండటం స్థానికులను కలచివేసింది. మృతులు తల్లి రజిత, పిల్లలు అయాన్(7), అసరజా (5), ఉస్మాన్ (14నెలలు)గా పోలీసులు గుర్తించారు.
బోయిన్ పల్లి మండలం కొదురుపాక నాలుగు వరుసల వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి గ్రామం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రజిత పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అవి ఆర్థిక ఇబ్బందులా ? లేక ఇతర గొడవలా ? అన్నది తెలియాల్సి ఉంది. రజిత బంధువులను విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story