Thu Dec 19 2024 19:08:19 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు పిల్లలు సహా తల్లి అదృశ్యం
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి మీనాక్షి తన ఇద్దరు చిన్నారులను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. భర్త శివకుమార్ ఇంటికి..
తన ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. తల్లి, పిల్లల అదృశ్యంతో ఆ కుటుంబంలో ఆందోళన రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ఝారసంఘం మండలంలోని జీర్లపల్లి గ్రామంలో మీనాక్షి శివకుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నందిని (10) జాహ్నవి (07) పిల్లలు ఉన్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి మీనాక్షి తన ఇద్దరు చిన్నారులను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. భర్త శివకుమార్ ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి భార్య, పిల్లలు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో ఆరా తీశాడు. ఎక్కడా వారి గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కంగారుపడిన భర్త.. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తల్లి, పిల్లల అదృశ్యం పై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story