Mon Dec 23 2024 06:42:17 GMT+0000 (Coordinated Universal Time)
మోత్కుపల్లి దారి.. అటు వైపేనా?
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మోత్కుపల్లి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ మొదటి వారంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. బెంగళూరులో డీకేను మోత్కుపల్లి కలవడంతో కాంగ్రెస్ లో ఆయన చేరిక లాంఛనమే అని అంటున్నారు. ఇప్పటికే మోత్కుపల్లి ఈ విషయమై తన అనుచరులతో చర్చించారనే ప్రచారం కూడా సాగుతూ ఉంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోత్కుపల్లి ఒక ప్రముఖ నేత.. తుంగతుర్తి నుంచి ఒక సారి, ఆలేరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మోత్కుపల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
Next Story