Sun Apr 06 2025 08:02:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే
వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు

వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ కావడం వల్లనే రాఘవను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా పోలీసులకు గాని, ప్రభుత్వానికి గాని పట్టడం లేదన్నారు.
అనేక ఆరోపణలు...
వనమా రాఘవపై అనేక ఆరోపణలున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వనమా వెంకటేశ్వరరావు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ విషయంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
Next Story