Thu Nov 28 2024 21:34:58 GMT+0000 (Coordinated Universal Time)
రూపాయి.. పాపం ఎవరిది?
రూపాయి విలువ పడిపోతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు
రూపాయి విలువ పడిపోతున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు లోక్సభలో ఆయన మాట్లాడారు. ఇండియన్ కరెన్సీ రోజురోజుకూ పడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి బలపడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ఆయన లోక్సభలో అధికార బీజేపీని నిలదీశారు.
అప్పుులు కూడా...
గతంలో రూపాయి విలువ 69 రూపాయలకు పడిపోయినప్పుడు ఐసీయూలోకి రూపాయి వెళ్లిందని అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ అన్న విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు రూపాయి పతనాన్ని చూసి ఏం అనాలని ఆయన ప్రశ్నించారు. రూపాయి విలువ 82 రూపాయలకు దాటి పోవడంతో ఆ ప్రభావం సామాన్యులపై పడుతుందని రేవంత్ రెడ్డి ఆగ్హం వ్యక్తం చేశారు. 67 ఏళ్లలో భారత్ ను ఏలిన పార్టీలు చేసిన అప్పుల కంటే మోదీ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేసిందని దుయ్యబట్టారు.
Next Story