Sun Dec 22 2024 22:05:18 GMT+0000 (Coordinated Universal Time)
పాపం పాల్.. విజయోత్సవానికి ముందే అనుమతి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దాదాపు రెండు నెలలు కొనసాగింది. అయితే ఇందులో ప్రధానంగా అందరినీ ఆకట్టుకున్న నేత కేఏ పాల్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దాదాపు రెండు నెలలు కొనసాగింది. అయితే ఇందులో ప్రధానంగా అందరినీ ఆకట్టుకున్న నేత కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ నుంచి తొలుత ప్రజాగాయకుడు గద్దర్ ను పోటీకి దింపాలని భావించారు. చివరి నిమిషంలో గద్దర్ విముఖత చూపడంతో కేఏ పాల్ స్వయంగా పోట ీచేశారు. ఆయనకు ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది.
బ్యాలట్ పేపర్లతో...
అయితే కేఏ పాల్ తొలి నుంచి తనకు యాభై వేల మెజారిటీతో గెలుస్తానని చెబుతున్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి తానేనని కూడా చెప్పుకున్నారు. గెలిచిన తర్వాత విజయోత్సవం జరుపుకోవడానికి పోలీసుల నుంచి కేఏ పాల్ అనుమతి తీసుకున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్ గా పాల్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయినా కేఏ పాల్ కు యాభై ఓట్లకు మించి రాలేదు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికను నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.
Next Story