Sat Dec 28 2024 12:11:16 GMT+0000 (Coordinated Universal Time)
దీపావళి రోజూ ఆగని ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దీపావళి పండగ రోజు కూడా జరుగుతుంది. పండగ పూట కూడా నేతలు ఓటర్లను కలుసకుంటున్నారు
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం దీపావళి పండగ రోజు కూడా జరుగుతుంది. పండగ పూట కూడా నేతలు ఓటర్లను కలుసకుంటున్నారు. చౌటుప్పల్ లోని చినకొండూరులోని రామాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలం పూలతో విన్నూత్నంగా ప్రచారం నిర్వహిచంారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
ఇంటింటికి తిరుగుతూ...
చౌటుప్పలో లో వీధి వీధి తిరుగుతూ బండి సంజయ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్వయంగా ఓటర్లను కలిసి కమలం పూలు అందిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బండి సంజయ్ వెంట మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహన్ రెడ్డి లు కూడా ఉన్నారు. మునుగోడు మండలంలో మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
Next Story