Mon Dec 23 2024 08:40:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫలితాల వెల్లడిపై బీజేపీ సీరియస్.. కేంద్రమంత్రి ఫోన్
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిపై భారతీయ జనతా పార్టీ సీరియస్ అయింది
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిపై భారతీయ జనతా పార్టీ సీరియస్ అయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చీఫ్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు ఫోన్ చేసి ఫలితాల విడుదల జాప్యంపై ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి వికాస్ రాజ్ తాను దీనికి సంబంధించి అప్డేట్ చేస్తానని చెప్పారు.
జాప్యంపై ఆగ్రహం...
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియజేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించాలని వారు కోరుతున్నారు.
Next Story