Mon Dec 23 2024 20:22:21 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో మునుగోడు ప్రచారానికి తెర
నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో అన్ని పార్టీలు చివరి రోజున ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి
నేటితో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. దీంతో అన్ని పార్టీలు చివరి రోజున ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. కాంగ్రెస్ ఈరోజు మహిళ గర్జన సభ జరగనుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఈరోజు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రానికి మైకులన్నీ మూగబోతుండటంతో గత కొద్ది రోజులుగా మునుగోడులో చేస్తున్న హడావిడి నేటితో ముగియనుంది.
కొత్త వారు ఎవరూ...
ఈరోజు సాయంత్రం నుంచి కొత్త వారు ఎవరినీ నియోజకవర్గంలో ఉండటానికి వీలు లేదని ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నియోజకవర్గానికి సంబంధం లేని వారు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సాయంత్రానికి అందరూ మునుగోడును ఖాళీ చేయాల్సి ఉంటుంది. గత నెలన్నర రోజుల నుంచి మునుగోడులోనే మకాం వేసిన అనేక మంది నేతలు ఈరోజు సాయంత్రానికి ఇంటి బాట పట్టనున్నారు.
Next Story