Wed Dec 25 2024 14:11:05 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్లో చేరిని పాల్వాయి స్రవంతి
మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు
మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ లో చేరారు. మునుగోడు టిక్కెట్ తనకు దక్కకపోవడంతో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిపోయారు. మంత్రి కేటీఆర్ పాల్యాయి స్రవంతికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అభివృద్ధి కోసమే....
ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి కోసమే తాను బీఆర్ఎస్ లో చేరినట్లు ఆమె తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారారన్నారు. కొద్ది రోజుల పాటు మునుగోడును రాజగోపాల్ రెడ్డి అస్తవ్యస్థం చేశారని కేటీఆర్ అన్నారు.
Next Story