Fri Jan 03 2025 03:22:42 GMT+0000 (Coordinated Universal Time)
గంగవ్వ కేటీఆర్ ను ఏమన్నదో తెలుసా..?
కరీంనగర్ కళోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులు అట్టహాసంగా సాగాయి.
కరీంనగర్ కళోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగాయి. చివరి రోజు మహాత్మా జ్యోతిబాపూలే మైదానం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ స్టేడియం దాకాసాగింది. ఉత్సవాల ఆఖరు రోజైన ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సోషల్ మీడియా సెన్సేషన్ గంగవ్వ మాట్లాడుతూ.. 'కేటీఆర్ మహేష్ బాబు లాగా ఉన్నాడు' అంటూ చెప్పుకొచ్చింది. కేటీఆర్ మాట్లాడుతూ.. వేదికపై గంగవ్వను ప్రత్యేకంగా దగ్గరకు తీసుకున్నారు. నన్ను మహేష్ బాబు లాగా ఉన్నారని అన్నారు.. కానీ, నాకేం ప్రాబ్లమ్ లేదు.. ఆ మాట వింటే మహేష్ బాబు ఫీల్ అవుతారని కేటీఆర్ నవ్వులు పూయింది. గంగవ్వ నువ్వు కళ్లు చూపించుకోవాలంటూ నవ్వులు పూయించారు. అంతేకాకుండా గంగవ్వకు మై విలేజ్ షోకు వస్తానని మాట ఇచ్చానని తెలిపారు. నాకు తెలిసిన నాలుగు విషయాలు చెబుతా.. నాకు తెలియని విషయాలు నేర్చుకుంటానని వ్యాఖ్యానించారు. ఇక కరీంనగర్ కళోత్సవాల్లో గొప్ప గొప్ప కళాకారులను నేరుగా కలిసే అవకాశం దొరికిందన్నారు.
'మై విలేజ్ షో' ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్‌లో వీడియోలు ప్రారంభించిన గంగవ్వ.. బిగ్ బాస్‌లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు. నటుడు శివారెడ్డి, సింగర్లు వొల్లాల వాణి, మధుప్రియ, స్వర్ణ, వందేమాతరం శ్రీనివాస్, వడ్లకొండ అనిల్, వంతడుపుల నాగరాజు, గంగవ్వ, జీల అనిల్, కొమురక్క, బిగ్‌బాస్ ఫేం సోహెల్ కూడా హాజరయ్యారు.
Next Story