Sun Dec 22 2024 11:19:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీకి తదుపరి విచారణకు వాయిదా వేసింది
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీకి తదుపరి విచారణకు వాయిదా వేసింది. హీరో నాగార్జున కొండా సురేఖ పై పరువు నష్టం, క్రిమినల్ చర్యల కింద దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కొండా సురేఖ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
నాగార్జున కుటుంబంపై...
అయితే మంత్రి కొండా సురేఖ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నాగార్జున పరువుకు నష్టం కలిగిందని భావించి పరువు నష్టం దావా వేశారు.
Next Story