Mon Dec 23 2024 17:32:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను దుర్భాషలాడటం, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులను చింపి వేయడం వంటి కేసుల్లో..
హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను దుర్భాషలాడటం, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులను చింపి వేయడం వంటి కేసుల్లో నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020 నవంబర్ 23న కేబీఆర్ పార్క్ వద్ద టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను అరవింద్, ఆయన అనుచరులు చింపి వేశారని కేసు నమోదైంది.
అలాగే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కూడా దుర్భాషలాడారని టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన ఎంపి అర్వింద్.. హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
Next Story