Mon Dec 23 2024 14:44:05 GMT+0000 (Coordinated Universal Time)
వింత : శివాలయంలో పాలు తాగుతోన్న నంది.. శివయ్య లీల?
క్రాంతినగర్, గాండ్ల సంఘం శివాలయంలో భక్తులు నందికి పాలు పోశారు. ఎన్నడూ లేనిది నంది పాలు తాగడం..
ఆదిలాబాద్ : గతంలో వినాయకుడు పాలు తాగడం, సాయిబాబా విగ్రహం నుంచి విభూతి రాలడం, రాముడు కన్నీళ్లు పెట్టుకోవడం వంటి ఘటనలు చూశాం. తాజాగా మరో వింత వెలుగులోకి వచ్చింది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు పాలు గుటాగుటా తాగేస్తున్నాడు. విషయం ఆ నోటా ఈ నోటాపడి.. జనాలందరికీ తెలియడంతో.. నందికి పాలు తాగించేందుకు, ఆ వింతను కళ్లారా చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ వింత ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
Also Read : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
జిల్లాలోని క్రాంతినగర్, గాండ్ల సంఘం శివాలయంలో భక్తులు నందికి పాలు పోశారు. ఎన్నడూ లేనిది నంది పాలు తాగడం మొదలుపెట్టింది. అది గమనించిన భక్తులు గిన్నెలు, చెంచాలతో నందికి పాలు తాగించారు. అయితే.. నిజంగా నంది పాలు తాగుతోందా ? లేదంటే విగ్రహం పాలను పీల్చేస్తుందా ? అన్న సందిగ్ధం నెలకొంది. ఏదేమైనా మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత ఇలాంటి ఘటన జరగడంతో ఇది నిజంగా శివయ్య లీల అని అంటున్నారు భక్తులు.
Next Story