Sun Nov 24 2024 16:41:38 GMT+0000 (Coordinated Universal Time)
నందీశ్వరుడికి నీళ్లు తాగిస్తున్న భక్తులు
రాంబాగ్ లోని చిన్న అనంతగిరి దేవాలయంలోని నందీశ్వరుడు నీళ్లు తాగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకేముంది ఈ విషయం..
కొన్నిచోట్ల దేవుడు పాలు తాగడం, వింత ఆకారంలో పశువుల జననం, దేవుని ఆకారంలో కూరగాయలు రావడం వంటి వింత వింతలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసి.. చూసేందుకు జనాలు తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ ఆశ్చర్యకర సంఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ శివాలయంలో కూడా చోటుచేసుకుంది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు నీళ్లు తాగుతున్నాడని సమాచారం అందగానే భక్తులు గుడి వద్దకు క్యూ కట్టారు.
రాంబాగ్ లోని చిన్న అనంతగిరి దేవాలయంలోని నందీశ్వరుడు నీళ్లు తాగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకేముంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్తాపూర్ లో ఉన్న చిన్న అనంతగిరిగా పిలుచుకునే శివాలయంలో నందీశ్వరుడు నీళ్లు తాగడం గమనించిన భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చెవిలో తమ కోరికలు చెప్పి నందీశ్వరుడికి నీళ్లు తాగించేందుకు భక్తులు శివాలయానికి భారీ ఎత్తున చేరుకున్నారు. భక్తులు, పూజారితో కలిసి నందీశ్వరుడికి నీళ్లు తాగించారు. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి తెలియడంతో భారీ ఎత్తున భక్తులు దేవాలయానికి చేరుకుని నందీశ్వరుడికి నీళ్లు తాగించేందుకు బారులు తీరారు.
Next Story