Mon Dec 23 2024 07:38:19 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు హైదరాబాద్కు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఎల్.బి. స్టేడియంలో నిర్వహించే బీసీ సదస్సులో ఆయన పాల్గొంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఎల్.బి. స్టేడియంలో నిర్వహించే బీసీ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీన తెలంగాణ పోలింగ్ జరగనుంది. పదో తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరొకసారి తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
బీసీ సదస్సుకు...
తాము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పిన నేపథ్యంలో బీసీ సదస్సును భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. బీసీ సదస్సును విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేసేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ ఏమేం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఎల్.బి. స్టేడియం వద్ద ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story