Mon Dec 23 2024 17:04:54 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సర్కార్ కు భారీ జరిమానా
జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. 3,800 కోట్ల రూపాయల జరిమానాను విధించింది
జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించింది. 3,800 కోట్ల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలతో పాటు గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పులను కూడా అమలు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
3,800 కోట్లు....
రెండు నెలల్లో 3,800 కోట్ల రూపాయలను ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. వెంటనే వ్యర్థాల నిర్వహణకు తీసుకున్న చర్యలు, దాని పురోగతిపై తెలియజేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రెండు విడతల్లో ఈ జరిమానాను చెల్లించవచ్చని తెలిపింది.
Next Story