Fri Nov 22 2024 17:10:01 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి షాక్ ఇచ్చిన గవర్నర్
ఈ ప్రక్రియకు మరింత సమయం పడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై
టీఎస్ఆర్టీసీ విలీన బిల్లు (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడం)పై అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత సంతకం చేస్తానని, ఈ ప్రక్రియకు మరింత సమయం పడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే తెలంగాణ గవర్నర్ మాత్రం సమయం కావాలని అంటున్నారు.
ఆర్ధిక బిల్లు కావడంతో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ బిల్లు తన వద్దకు వచ్చిందని చెప్పారు. బిల్లును పరిశీలించి న్యాయ సలహాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లోని 43,000 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూలై 31, సోమవారం నాడు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. మార్గదర్శకాలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
Next Story