Mon Dec 23 2024 20:35:16 GMT+0000 (Coordinated Universal Time)
నెహ్రూ జూపార్క్ లో గంధపు చెట్ల స్మగ్లింగ్ : నలుగురు ఉద్యోగులు అరెస్ట్
జూ పార్క్ లో 7 గంధపు చెట్లను నరికి వాటిని దొంగలుగా చేసి అక్కడి నుండి తరలించిన విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు..
పుష్ప సినిమా తరహాలో పోలీసులకు ఏమాత్రం క్లూస్ దొరకకుండా అతి జాగ్రత్తగా నెహ్రూ జూలాజికల్ పార్క్ లో గుర్తు తెలియని కొందరు దుండగులు ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దొంగలుగా చేసి అక్కడి నుండి తీసుకువెళ్లిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపింది. నేరం చేసే ప్రతి వ్యక్తి పోలీసుల చేతికి చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు కానీ ఎంతో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని పోలీసులు దుండగులను ఇట్టే పట్టుకుంటున్నారు. జూ పార్క్ లో ఏడు గంధపు చెట్లను నరికి.. సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా అక్కడి నుండి తరలించి.. అందరినీ విస్తుపోయే విధంగా చేసిన ఆ దుండగులు కూడా పోలీసుల చేతికి చిక్కమని హుందాగా తిరుగుతున్నారు. కానీ సడెన్ గా పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో దుండగులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసుల చేతికి నలుగురు దుండగులు చిక్కారు.
జూ పార్క్ లో 7 గంధపు చెట్లను నరికి వాటిని దొంగలుగా చేసి అక్కడి నుండి తరలించిన విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బహదూర్ పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించారు. కానీ రెండు ఎంట్రెన్స్లలో ఉన్న సీసీ కెమెరాల్లో గంధపు చెట్ల దుంగలు తీసుకువెళ్లినట్లుగా ఏ దృశ్యాలు కూడా రికార్డు కాలేదు. దీంతో పోలీసులకు ఇది ఇంటి దొంగ పనే అని అనుమానం వచ్చి ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగించడంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ కేసులో జూ పార్క్ లో పనిచేస్తున్న నలుగురు జూనియర్ స్థాయి సిబ్బంది పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏ చిన్న ఆధారాలు కూడా పోలీసుల చేతికి చిక్కకుండా.. అక్కడున్న సీసీ కెమెరాల్లో కూడా దృశ్యాలు రికార్డు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏడు గంధపు చెట్లను నరికి వాటిని చిన్నచిన్న దుంగలుగా చేసి అక్కడి నుండి తరలించిన తీరుకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆ పార్క్ లో పనిచేస్తున్న నలుగురు జూనియర్ స్థాయి సిబ్బందిదే.
నలుగురు ఉద్యోగులు తెలివిగా పార్కులో ఉన్న సీసీ కెమెరాలు కట్ చేసి అనంతరం గంధపు చెట్లను నరకించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆ చెట్లను దొంగలుగా మార్చి బయటికి తరలించినట్లుగా పోలీసులు కనుక్కున్నారు. పోలీసులు వెంటనే నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు జూ పార్క్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు గంధపు చెట్లను నరికిన విషయం తెలియడంతో ఉన్నతాధికారులు వెంటనే ఆ నలుగురిని విధుల్లో నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఈ గంధపు చెట్లను ఎందుకు నరికారు? వాటిని ఎక్కడికి తరలించారు? ఈ నలుగురితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? చెట్లను నరికే సమయంలో పార్కులో వేరే సిబ్బంది లేరా? అసలు పార్క్ లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story