Mon Sep 16 2024 19:26:57 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం (17.07.2024) హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కన్వీనర్ తుల అరుణ్ కుమార్ ఆమెను అభినందించారు.
నెరేళ్ల శారద సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, వారి జీవితాలను మెరుగుపరచడం, హక్కులను పరిరక్షించడం, వివక్షను తొలగించడంలో క్రియాశీల పాత్ర పోషించాలని భీంరెడ్డి, అరుణ్ కుమార్ ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, స్థానిక స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు వివిధ అంతర్జాతీయ వేదికలలో రాష్ట్ర మహిళల ప్రాతినిధ్యం పెంచడంలో రాష్ట్ర మహిళా కమీషన్ ది ప్రధాన పాత్ర అని వారు అన్నారు.
Next Story