Mon Dec 23 2024 10:19:13 GMT+0000 (Coordinated Universal Time)
RRRకి కొత్త అర్థం చెప్పిన సజ్జనార్.. నెటిజన్లు ఫిదా !
తాజాగా RRRకి కొత్త అర్థం చెప్తూ.. ఇటీవలే విడుదలైన ఎత్తరజెండా పాటను ఆర్టీసీ ప్రచారానికి వాడేసుకున్నారు. సజ్జనార్ క్రియేటివిటీ
హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ గా పనిచేసిన సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ అయ్యాక అక్కడి పరిస్థితులే మారిపోయాయి. ఆర్టీసీ బస్సు పరుగులు తీస్తోంది. ఎండీగా సజ్జనార్ వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ.. ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. తాజాగా RRRకి కొత్త అర్థం చెప్తూ.. ఇటీవలే విడుదలైన ఎత్తరజెండా పాటను ఆర్టీసీ ప్రచారానికి వాడేసుకున్నారు. సజ్జనార్ క్రియేటివిటీ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
RRR ను 'రాష్ట్ర రోడ్డు రవాణా'గా వర్ణించారు సజ్జనార్. అలాగే 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' పాటలో తారక్, చరణ్ లు పట్టుకున్న జెండా పై వందేమాతరం అని ఉండగా.. సజ్జనార్ దాని స్థానంలో టీఎస్ఆర్టీసీ అని రాయడంతోపాటు దాని కింద బస్సు, లోగోను పెట్టారు. ఆర్టీసీలో ప్రయాణించండి..సురక్షితంగా గమ్యాన్ని చేరండి అంటూ వీడియోలో తెలిపారు. ఆర్టీసీ ప్రచారం కోసం సజ్జనార్ చేసిన క్రియేటివిటీని చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
Next Story