Sat Nov 23 2024 01:05:00 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్
తెలంగాణలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అంశంపై
తెలంగాణలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రజలు చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు గత 9 ఏళ్లుగా జారీ కాకపోవటంతో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది.
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అసలైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై చర్చలు కొనసాగాయి. సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నారు.
Next Story