Mon Dec 23 2024 05:44:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్లు
తెలంగాణలో ఎంపికయిన కొత్త ఉపాధ్యాయులకు నేడు పోస్టింగ్లు ఇవ్వనున్నారు
తెలంగాణలో ఎంపికయిన కొత్త ఉపాధ్యాయులకు నేడు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. 10,006 పోస్టులను ఇటీవల డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేసిన ప్రభుత్వం ఇటీవలే వారికి నియామక పత్రాలను అందచేసింది. వారందరికీ దసరా సెలవుల తర్వాత పోస్టింగ్లను ఇవ్వనుంది. రేపు నియమితులైన టీచర్లందరూ పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈరోజు డీఈవోలు సూచించిన కార్యాలయాల్లో కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది.
కౌన్సిలింగ్ నిర్వహించి...
మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ అంటే రేపు చేరాల్సి ఉంటుంది. వారు చేరిన స్థానంలో మూడు నెలల క్రితం బదిలీ అయి రిలీవ్ కాని వారు ఉంటే వారు రిలీల్ అయి వారికి కేటాయించిన పాఠశాలలకు వెళతారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇటీవలే దసరా పండగ రోజు కొత్తగా నియమితులైన టీచర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందచేసిన సంగతి తెలిసిందే.
Next Story