Mon Dec 23 2024 11:41:17 GMT+0000 (Coordinated Universal Time)
30న సచివాలయం ప్రారంభం
ఈ నెల 30వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఈ నెల 30వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇటీవల సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక ముహూర్తాలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మధ్యలో అడ్డు రావడంతో సచివాలయం ప్రారంభం ఆగిపోయింది. దీంతో పాటు కొన్ని పనులు కూడా జరగాల్సి ఉండటంతో సచివాలయం ప్రారంభం వాయిదా పడింది.
జాతీయ నేతలను...
అయితే ఈ నెల 30వ తేదీన సచివాలయం ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. అధునాతన సౌకర్యాలతో 400 కోట్ల రూపాయలతో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుటుంది. భవనం కూడా దూరం నుంచి అందరినీ అలరిస్తుంది. ఈ ప్రారంభోత్సవం అట్టహాసంగా చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్త సచివాలయాన్ని నిర్మించుకోవడం విశేషంగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి జాతీయ నేతలు కూడా ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story