Mon Dec 23 2024 10:02:16 GMT+0000 (Coordinated Universal Time)
Tspsc : లీకేజీలో కొత్త కోణం
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ లో కొత్త విషయాలు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లకు ప్రశ్నాపత్రాలు అందినట్లు సమాచారం
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లకు కూడా ప్రశ్నాపత్రాలు అందినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని రెండు కోచింగ్ సెంటర్ల యాజమాన్యానికి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. రేణుక ఈ కోచింగ్ సెంటర్లకు ప్రశ్నాపత్రాలను విక్రయించారన్న అనుమానాలు సిట్ అధికారులు బలంగా వ్యక్తం చేస్తున్నారు.
రేణుక విక్రయించడంతో...
అందుకే ఆ రెండు కోచింగ్ సెంటర్లకు కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. రేణుక విక్రయించడంతో వారు పెద్దమొత్తంలో డబ్బులు కూడా అందచేసినట్లు చెబుతున్నారు. ఇక టీఎస్పీఎస్సీలోని 42 మంది సిబ్బందికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది. వీరందరినీ విచారించిన తర్వాత క్లారిటీ రానుందని సిట్ అధికారులు చెబుతున్నారు. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ ఎవరికి ప్రశ్నాపత్రం అందచేశాడన్న దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు.
Next Story