Mon Dec 15 2025 04:17:29 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Police: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పోలీసు శాఖలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక మార్పు జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇన్ని రోజులూ ఉన్న కొత్తకోట శ్రీనివాస రెడ్డి స్థానంలో ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఐపీఎస్ అధికారుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఆనంద్‌ను పోలీసు కమిషనర్‌గా, కొత్తకోట శ్రీనివాస రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ ఎం.భగవత్ అదనపు డీజీ (పర్సనల్ అండ్ వెల్ఫేర్) గా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పోలీసు, ప్రొవిజనింగ్, లాజిస్టిక్స్ ఐజి, డిజిపి కార్యాలయం ఎం రమేష్, ఐజి ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్) పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Next Story

