Mon Dec 23 2024 09:42:26 GMT+0000 (Coordinated Universal Time)
పీజీ డాక్టర్ ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. నిమ్స్ వైద్యులు ఏం చెప్పారంటే..
అయితే ఆమె కిడ్నీ, గుండె పనితీరులో కొంత మెరుగుదల ఉందని బులెటిన్లో పేర్కొన్నారు. నిపుణులైన వైద్యుల బృందం ఆమెను నిశితంగా..
సీనియర్ డాక్టర్ వేధింపుల కారణంగా కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. తాజాగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ ప్రీతి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై ఉందని బులెటిన్లో పేర్కొన్నారు. నిన్నటి కంటే నేటికి ఆమె కిడ్నీ, గుండె పనితీరులో కొంత మెరుగుదల ఉందన్నారు. నిపుణుల వైద్యబృందం ఆమెను పరిశీలిస్తోందని తెలిపారు .
అయితే ఆమె కిడ్నీ, గుండె పనితీరులో కొంత మెరుగుదల ఉందని బులెటిన్లో పేర్కొన్నారు. నిపుణులైన వైద్యుల బృందం ఆమెను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రీతిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డాక్టర్ ప్రీతికి ECMO (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్)లో చికిత్స అందిస్తున్నారని, చికిత్సకు ఆమె శరీరం స్పందిస్తోందని వైద్యులు స్పష్టం చేశారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో ఎక్మోలో ఉంచినట్లు తెలిపారు. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుల బృందంలో అనస్థీషియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు.
Next Story