Mon Dec 23 2024 09:21:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కిరాతకుడిని టీఆర్ఎస్ నుంచి బహిష్కరణ
నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు
నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రకటించారు. 16 ఏళ్ల అమ్మాయిపై షేక్ సాజిద్ అత్యాచారానికి పాల్పడ్డరాని ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ సాయంతో సాజిద్ అమ్మాయిని హైదరాబాద్ కు తీసుకు వచ్చి అత్యాచారం చేశారని అమ్మాయి తల్లి ఆరోపించింది.
పోక్సో చట్టం కింద...
దీనిపై పోలీసులు షేక్ సాజిద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే పార్టీ ప్రతిష్టను భంగం కలిగించాడని షేక్ సాజిద్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడంతో సాజిద్ కు, టీఆర్ఎస్ కు సంబంధం లేదని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు. అత్యాచారానికి గురైన అమ్మాయికి న్యాయం చేస్తామని ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు.
Next Story