Mon Dec 23 2024 17:26:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఖానాపూర్ లోనూ ఎగిరిన కాంగ్రెస్ జెండా
ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది
ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ లు తమ పదవులను కోల్పోయారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయింది. వరసగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ తమ అధీనంలోకి తెచ్చుకుంటుంది.
తొమ్మిది మంది....
ఖానాపూర్ లో తొమ్మిది మంది బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో కాంగ్రెస్ గెలిచినట్లయింది. ఇప్పటికే తెలంగాణలో అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఛైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీకిచెందిన కౌన్సిలర్లు ఛైర్మన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
Next Story