Fri Nov 22 2024 23:57:44 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీ సభకు నో చెప్పిన ఓయూ
కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6వ తేదీన వరంగల్ వేదికగా ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహిస్తోంది. ఈ సభకు..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీలో అవకాశం ఇవ్వలేదు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరగా దాన్ని తిరస్కరిస్తున్నట్లు ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం నాడు ఓ ప్రకటన జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కౌన్సిల్. క్యాంపస్లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది.
కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6వ తేదీన వరంగల్ వేదికగా 'రైతు సంఘర్షణ సభ' నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని అనుకున్నారు. మే 6న తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ అదే రోజున వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత రోజు హైదరాబాద్లో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఓయూలోనూ రాహుల్ గాంధీ కోసం ఓ సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ అధికారులను కోరింది. ఈ ప్రతిపాదనపై సుధీర్ఘంగా ఆలోచన చేసిన ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ రాహుల్ గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తూ ప్రకటన జారీ చేసింది.
Next Story